Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. 63 ఏళ్ల నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎయిమ్స్ కు వెళ్లారు. దీంతో ప్రయివేటు వార్డ్ లో చేరినట్టు సమాచారం. వార్షిక వైద్య పరీక్షల కోసమే మంత్రి సీతారామన్ ఆస్పత్రిలో చేరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరీక్షల అనంతరం మంత్రిని ఈ రోజే డిశ్చార్జ్ చేస్తారని తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.