Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాల కార్మిక ఐక్య పోరాటాలతోనే వికలాంగుల హక్కులు సాధ్యం
- ఎన్ పి ఆర్ డి జాతీయ మహాసభ ప్రారంభంలో అధ్యక్షులు కాంతి గంగూలీ
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
విశాల కార్మిక ఐక్య పోరాటాలతో నే వికలాంగుల హక్కులు సాధ్యమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి) అధ్యక్షులు కాంతి గంగూలీ అన్నారు. ఎన్ పి అర్ డి 3వ జాతీయ మహాసభ ప్రారంభం సందర్భంగా సోమవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహాసభ లో ఆయన మాట్లాడారు.
రైతాంగ కార్మిక పోరాటం జరిగిన గడ్డ పై అమరుల స్పూర్తి తో మహాసభ జరగటం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో ఉద్యమాలతో 2016లో వికలాంగుల హక్కుల రక్షణ చట్టం వచ్చినా అది పూర్తీ స్థాయిలో అమలు కావడం లేదని చెప్పారు. రైతాంగ ఉద్యమ స్పూర్తితో హక్కులను సాధించు కోవటానికి వికలాంగులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీల మద్దతుతో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయి చట్టం వచ్చినా పూర్తీ స్థాయిలో అమలు కాకపోవటం దురదృష్టకరమన్నారు.
ఈ మహాసభల్లో ఉద్యమ కార్యాచరణ పై చర్చిస్తామన్నారు. చాలా రాష్ట్రాల్లో వికలాంగులకు పెన్షన్ వెయ్యి ఇస్తున్నారు. తెలంగాణలో రూ. 3వేలు ఇస్తున్నారు. అది చాలదు రూ. 5వేలకు పెంచాలి. కార్పొరేట్ల కు లక్షల కోట్లు మాఫీ చేస్తూ వికలాంగులకు పెన్షన్ పెంచమంటే ప్రభుత్వాలు బీద అరుపులు వినిపిస్తున్నయని ఎద్దేవా చేశారు.
వికలాంగుల లెక్కల్లో కూడా గందరగోళం ఉంది. ప్రభుత్వం లెక్క తక్కువ చూపుతుందని చెప్పారు. అంగ వైకల్యం శాపం కాదనీ.. ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు. హక్కుల సాధన కోసం జాతీయ స్థాయిలో ఉద్యమ రూపకల్పనపై ఈసభలు మార్గదర్శనం చేస్తాయని వివరించారు. ఎన్ పి ఆర్ డి తెలంగాణ అధ్యక్షులు వెంకట్ అధ్యక్షతన జరిగిన సభలో ఎన్ పి ఆర్ డి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, హెలెన్ కిల్లర్ విద్యాసంస్థల చైర్మన్ ఉమర్ ఖాన్, ఎన్ పి ఆర్ డి నాయకులు అడివయ్య, సాయమ్మ, జాన్సీ, అర్ వెంకటేష్ తదితరులు మాట్లాడారు.