Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చైనా, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ పాకుతుంది. ఆయా దేశాల్లో కలకలం రేపుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంటే భారత్‌లోనూ బయటపడింది. ఇటీవల గుజరాత్‌లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో బీఎఫ్.7 ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు.
దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి విదేశాల నుంచి వచ్చే దేశీ, విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం యూపీలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇవాళ ఉదయం బీహార్‌లో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో వారిని ఐసోలేషన్‌లో పెట్టి, వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. తాజాగా కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరు ఈ నెల 24న దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చినట్లు, మరో వ్యక్తి కౌలాలంపూర్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.