Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇవాళ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్టాడారు. దేశాన్ని పాలిస్తున్న వారు హిందీ కంపల్సరీ మాట్లాడాలని అనడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం అన్న పదాన్ని కూడా నిషేధించాలి. యూనియన్ ప్రభుత్వం అని పిలవాలని సూచించారు. మన గవర్నర్స్ రాజ్‌భవన్‌లో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్‌ను కాదని స్పష్టం చేశారు.
బహిరంగంగా గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్రాలకు 41 శాతం నిధులు ఇస్తున్నామని చెబుతుంది ఇది పచ్చి అబద్ధం అని, కేవలం 21 శాతం నిధులు ఇస్తుందని, 2011 జనాభా లెక్కలు తీసుకోని నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి. ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి. తద్వారా కేంద్రంలోకి మళ్లీ ఉత్తరాది వారే అధికారంలోకి వస్తారని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పై దాడి జరుగుతుంది. ఇది మంచిది కాదని తెలిపారు.