Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 21 కార్లు పూర్తిగా కాలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో ఈ ఘటన జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఆ భవనం సెల్లార్‌లో ఓ వ్యక్తి తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో లభ్యమైంది. తెల్లవారుజామున 4 గంటలకు తమకు సమాచారం అందడంతో ఆరు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6:10 గంటలకు మంటలు అదపులోకి వచ్చాయన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. అయితే ఈ భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదని ధృవీకరించారు.