Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరత్: ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. విడాకులు ఇచ్చిందనే కోపంతో మాజీ భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన శంకర్ కాంబ్లేకు తన భార్య రెండు నెలల క్రితం విడాకులు ఇచ్చింది. అయితే తిరిగి ఇంటికి రావాలని భార్యను కోరాడు. కానీ భార్య అందుకు తిరస్కరించింది. దీంతో కోపం తెచ్చుకున్న కాంబ్లే.. తన మాజీ భార్యను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు. కాసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంబ్లేను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని హెచ్ఐవీ వార్డుకు వెళ్లి.. ఓ పాజిటివ్ రోగి నుంచి రక్తాన్ని సేకరించినట్లు నిందితుడు తెలిపాడు. రక్త పరీక్షలకు అని చెప్పి రక్తాన్ని సేకరించానని పేర్కొన్నాడు.