Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కీలకమైన సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో ఢిల్లీ బయల్దేరారు సీఎం జగన్. రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. జనపథ్ 1లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలో కూడా సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా సీఎం జగన్ హాజరయ్యారు.