Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాడేపల్లి: దళితులకు జరుగుతున్న అన్యాయాలపై, సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపుపై, కార్పొరేషన్లో నిర్వీర్యం చేయటంపై బుధవారం ఉదయం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...ఈ ర్యాలీకి దళితులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. దళితులంతా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారన్నారు. అయితే గద్దెనెక్కాక ఎస్సీ సప్లై నిధులను దారి మళ్లిస్తూ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసి దళితులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్క దళిత బిడ్డ పెద్ద ఎత్తున తాడేపల్లిలోని ఎస్సీ ఫైనాన్స్ డైరెక్టరేట్ వద్దకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకుమర్తి రామారావు కోరారు.