Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు చంద్రబాబు నివాళులర్పించారు. కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ మృతి బాధాకరమని, ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు. సీనియర్ ఎన్టీఆర్తో 100కు పైగా సినిమాల్లో నటించడం అరుదైన రికార్డ్ నెలకొల్పారని చెప్పారు. సత్యనారాయణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియడారు. 1996లో టీడీపీ నుంచి ఎంపీగానూ గెలిచారని గుర్తుచేశారు. కైకాల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.