Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: వైకుంఠద్వార దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కోరారు. నూతన సంవత్సరం, వైకుంఠద్వార దర్శనాల సందర్భంగా మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఏడాది, వైకుంఠద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. సర్వదర్శన భక్తులకు తిరుపతిలో తొమ్మిది చోట్ల 92 కౌంటర్లు నెలకొల్పుతున్నామని తెలిపారు. టోకెన్లు తీసుకుని భక్తులు తిరుమలకు రావాలని సూచించారు. ఉచిత టోకెన్లు ఉన్నవారు కృష్ణతేజ అతిథిగృహం వద్ద రిపోర్టు చేయాలని అన్నారు. రోజుకు రెండువేల చొప్పున శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు జారీ చేశామని, గోవిందమాల వేసుకున్న భక్తులూ టోకెన్లు తీసుకురావాలి పేర్కొన్నారు. భక్తులకు శీఘ్ర దర్శనం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ వెల్లడించారు.