Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సామాన్య భక్తులకు, వీఐపీలకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజాము రెండు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1, 2 వ తేదీల్లో రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం ,ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్‌లను నడుపుతున్నట్లు వెల్లడించారు.