Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి పదో విడత రైతుబంధు నిధులు విడుదల కానున్నాయి. పదో విడత రైతుబంధుకు కింద ప్రభుత్వం 7వేల676 కోట్ల 61 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు సాయం అందనుంది. 70లక్షల54 వేల మంది రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి విడతల వారిగా నగదు జమకానుంది. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు 7వేల434కోట్ల67 లక్షల రైతుబంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.
రేపటి నుండి పదో విడత రైతుబంధు నిధుల విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు నగదు జమ అవుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.