Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ ఏడాది మరో ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా జట్టు వన్డే స్పెషలిస్ట్ ఫర్హాన్ బెహర్డియెన్ మంగళవారం క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ’18 ఏళ్ల జర్నీ.. అన్ని ఫార్మాట్లలో 560 మ్యాచ్‌లు. వీటిలో జాతీయ జట్టు తరఫున 97 మ్యాచ్‌లు’ అని ట్విట్టర్ వేదికగా ఫర్హాన్ తెలిపాడు. 2018 నవంబర్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఇతను చివరి మ్యాచ్ ఆడాడు. జొహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన ఇతను 2004లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేశాడు. 125 మ్యాచుల్లో 7వేలకు పైగా పరుగులు సాధించాడు. అయితే.. జాతీయ జట్టులో చోటు కోసం ఎనిమిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2012 ఫర్హాన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదించాడు. మూడు టీ20 వరల్డ్ కప్‌లు (2012, 2014, 2016), 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాడు. 59 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఫర్హాన్ వన్డేల్లో 1,074 రన్స్, పొట్టి క్రికెట్లో 518 రన్స్ స్కోర్ చేశాడు. 2017లో దక్షిణాఫ్రికా టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా పనిచేశాడు. అయితే.. ఈ ఆల్‌రౌండర్ తన కెరీర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.