Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పూణేలో ఒక అనాథాశ్రమంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. పూణే క్యాంప్‌లోని ఈస్ట్ స్ట్రీట్‌లో ఉన్న నాలుగు అంతస్తుల తయ్యబియా ఆర్ఫనేజ్ ట్రస్ట్‌లో మధ్యాహ్నం 12ః40 ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో బిల్డింగ్ అంతా పొగ వ్యాపించింది. వెంటనే అనాథాశ్రమ నిర్వాహకులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. పిల్లలను సురిక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 10 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశామని ప్రదీప్ ఖేడేకర్ అనే అధికారి తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రమాదం సమయంలో అనాథాశ్రమంలో 100 మంది పిల్లలు ఉన్నారు. వీళ్లలో 6 నుంచి 16 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. పిల్లలకు గాయాలు కాలేదు. ఈ సంఘటనలో కింది అంతస్తులో దాచి ఉంచిన ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి.