Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందకుమార్ రెండ్రోజుల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ ముగిసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్ గోయల్, దేవేంద్రకుమార్, వీర నారాయణరెడ్డి నేతృతంలో చంచల్‌గూడ జైల్లో 6గంటలకు పైగా విచారణ సాగింది. నందకుమార్ స్టేట్మెంట్ను అధికారులు నమోదు చేశారు. రెండో రోజు ప్రధానంగా సెవెన్ హిల్స్ మాణిక్‌చంద్ గుట్కా డైరెక్టర్ అభిషేక్ ఆవాలా, నందకుమార్ మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డితో జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.100కోట్లు ఎలా సమకూర్చాలనుకున్నారు? తదితర అంశాలపై ఈడీ ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. నందకుమార్ ఇచ్చిన సమాచారం, ఆధారాలను ఈడీ అధికారులు సీల్డ్ కవర్లో నాంపల్లి కోర్టుకు సమర్పించనున్నారు.