Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ను ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు వివిధ స్టేషన్ల మధ్య మొత్తం 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల మధ్య భారీగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీసులు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఈ రైళ్లలో రిజర్వ్ కోచ్లు, అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.