Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ ఇండియా టెలికాం కంపెనీ రిలయన్స్‌తో జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు జియో ట్రూ 5జీ సేవలను అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది. ఇకపై తమ స్మార్ట్ఫోన్లు జియో స్టాండలోన్ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తాయని షావోమీ తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా షావోమీ, రెడ్మీకి చెందిన అన్ని స్మార్ట్ఫోన్లలో 5జీ కనెక్టివిటీతో పాటు అంతరాయం లేని వీడియో స్ట్రీమింగ్, హై రిజల్యూషన్ వీడియో కాల్స్, తక్కువ లేటెన్సీ కలిగిన గేమింగ్‌ను ఆనందించొచ్చు. ఇందుకోసం షావోమీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సెట్టింగ్స్‌లో జియో ట్రూ 5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భాగస్వామ్యం వల్ల షావోమి, రెడ్మీ వినియోగదారులు బెస్ట్ 5జీ సేవలను పొందొచ్చని ఆ కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ అన్నారు. కొత్తగా రాబోయే అన్ని షావోమీ 5జీ స్మార్ట్ఫోన్లూ జియో స్టాండలోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయని జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.