Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు పోలీసు, అటు జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కదలికపై నిఘా పెట్టిన పోలీసులు పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. భద్రాచలం వంతెనపైకి ఎవరిని రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సారపాక నుంచే వాహనాలను నిలిపివేశారు. ఇతరులు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాకలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతంలో మూడు హెలీప్యాడ్లను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. సారపాక నుంచి రాష్ట్రపతి టూర్ ప్రారంభం కానుండడంతో భద్రాచలం గోదావరి వంతెన మీదుగా రామాలయం, వీరభద్రకళ్యాణ మండపం వరకు కాన్వాయ్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పూర్తిస్థాయిలో వారి కంట్రోల్‌కు తెచ్చుకున్నారు.