Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2022 కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధ, గురువారాల్లో(ఈ నెల 28, 29 తేదీల్లో) దేశంలోని మొత్తం 243 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. దాదాపు 2.59లక్షల మందికి పైగా రాసే అవకాశం ఉంది. దీనికి సంబంధిత అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోకపోతే ctet.nic.in లో పొందొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో సంబంధిత పరీక్ష కేంద్రాలు
ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్