Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గర్భిణులకు వైద్య సాయాన్ని అందించేందుకు ఐఐటీ రూర్కీ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి స్వస్థ్గర్భ్ అనే మొబైల్ యాప్ను అభివృద్ధి చేశాయి. ఇది గర్భిణులకు అవసరమైన వైద్య సలహాలు అందించేందుకు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమయానుగుణంగా తీసుకోవాల్సిన వైద్యం, చేయించుకోవాల్సిన పరీక్షలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ఈ యాప్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గర్భంతో ఉన్న సమయంలో సాధారణంగా వచ్చే సమస్యలకు ఈ యాప్ పరిష్కారాలు అందిస్తుందని తెలిపారు. అంతే కాకుండా డబ్ల్యూహెచ్వో నియమాలకు అనుగుణంగా ఇది పని చేస్తుందని వివరించారు.