Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొవిడ్-19 నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఆవిష్కరించిన నాసికా టీకా, ఇన్‌కొవాక్ కొవిన్ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నాసికా టీకాను వాషింగ్టన్ యూనివర్సిటీ-సెయింట్ లూయీస్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా, ఈ టీకాను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయొచ్చు. తెలంగాణ, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్రల్లోని భారత్ బయోటెక్ యూనిట్లలో దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు.
టీకా ధర ప్రయివేటు వినియోగానికి ఒక డోసు ధర రూ.800 (జీఎస్టీ అదనం) కాగా, ప్రభుత్వాలకు రూ.325 ధరకే (జీఎస్టీ అదనం) అందించనున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. జనవరి నాలుగో వారం నుంచి ఈ టీకా మార్కెట్లో అందుబాటులోకి రానున్నది. కొవిడ్-19కు రెండు భిన్నమైన టీకాలను తాము ఆవిష్కరించినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొవాగ్జిన్, ఇన్‌కొవాక్ టీకాలను భిన్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించాం. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు ఇన్‌కొవాక్ వల్ల టీకా ఇవ్వడం, రవాణా, నిల్వ ఎంతో సులువవుతుందన్నారు.