Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని సిధ్రాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ ని పోలీసులు నిర్వీర్యం చేసిన తర్వాత ఎన్కౌంటర్ జరిగింది.
సిధ్రా శివార్లలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారని అందిన సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలతో కలిసి గాలిస్తుండగా వారు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. బసంత్ గఢ్ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి. డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.