Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా నార్సింగి వద్ద డిటోనేటర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు రోజుల క్రితం సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు పనుల్లో భాగంగా బండరాళ్ల మధ్య అమర్చిన మూడు డిటోనేటర్లో ఒకటి బుధవారం ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బండరాళ్లు ఆకాశంలోకి ఎగిరి కిందపడడంతో అక్కడ పనిచేస్తున్న కొందరు భయాందోళనతో పారిపోగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.