Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ భద్రాచలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటనలో భాగంగా రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను వర్చువల్గా ప్రారంభించారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తెలంగాణలో తన పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందన్నారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని అన్నారు. భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని, తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు. రామాయణంలో భద్రాచలానికి ప్రత్యేక అనుబంధం ఉందని, సీతారాములు, లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలం గడిపారని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతున్నదని, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి పర్యాటకశాఖ దృష్టి సారించిందన్నారు. గిరిజనుల అభివృద్ధికి వనవాసి కల్యాణ పరిషత్ ఎంతో కృషి చేస్తున్నదని ప్రసంగించారు.