Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హిరాబెన్(100) ఇక లేరు. ఆమె అహ్మదాబాద్ లోని తన నివాసంలో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. వయో సంబంధ సమస్యలతో చికిత్స ఫలించకపోవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఇవాళే జరుగనున్నాయి. ఇందులో భాగంగానే, ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ అంతిమయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. అంతిమయాత్రలో స్రధాని స్వయంగా తల్లి హీరాబెన్ పాడె మోశారు.