Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న కారు ఢివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి. బీఎండబ్ల్యూ కారునే స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ కారుకు ప్రమాదం అయ్యాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. ఆ జట్టులో పంత్ కూడా ఉన్నారు. ఆ సిరీస్‌లో 46, 93 రన్స్ స్కోర్ చేశాడతను.
కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ వేడుకల్ని పంత్ దుబాయ్‌లో జరుపుకున్నాడు. కెప్టెన్ ధోనీ, అతని ఫ్యామిలీతో పాటు పంత్ ఆ సెలబ్రేషన్లో ఉన్నారు. ధోనీ భార్య సాక్షి ఆ ఫోటోలను షేర్ చేసింది.