Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్ నవ్సారి జిల్లాలోని సుపా గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం భజన్ కార్యక్రమం నిర్వహించారు. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఈ సంగీత కచేరి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారు సంగీత కళాకారులపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై డబ్బులు వెదజల్లారు. ఇలా మొత్తంగా దాదాపు రూ. 50 లక్షలు సమకూరినట్టు ట్రస్ట్ పేర్కొంది. కాగా, సంగీత కచేరిలో అభిమానులు డబ్బులు వెదజల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.