Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సంతాపం తెలిపారు.