Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. ఆ దేశ సైనిక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దీంతో ఆమెకు వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష మొత్తం 33 ఏళ్లకు చేరుకున్నది. 2021 ఫిబ్రవరిలో ఆ దేశ సైన్యం.. ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆంగ్ సాన్ సూకీ హౌజ్ అరెస్టులో ఉన్నారు. మొత్తం 19 అభియోగాలపై ఆమె 18 నెలల పాటు విచారణలను ఎదుర్కొన్నారు. సూకీని రిలీజ్ చేయాలని ఇటీవల యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ఓ ప్రకటనలో కోరింది.
సూకీపై ఉన్న చివరి అయిదు కేసుల్లో శుక్రవారం విచారణ జరిగింది. ఆమె అవినీతికి పాల్పడినట్లు కోర్టు దోషిగా తేల్చింది. హెలికాప్టర్‌ను ఓ మంత్రికి రెంట్ ఇచ్చిన విషయంలో ఆమె నియమావళిని ఉల్లంఘించినట్లు తెలిసింది. గతంలో 14 కేసుల్లో ఆమెను విచారించారు. కోవిడ్ నియమావళిని ఉల్లంఘించడంతో పాటు వాకీ టాకీలను దిగుమతి చేయడం, అధికారిక రహస్య చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలోనూ ఆమెను విచారించారు.