Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మనస్తాపంతో ఆర్మీజవాన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం భగత్‌నగర్‌కు చెందిన మార్త అశోక్ఉపుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొద్దు రజితతో 2021జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్‌కుమార్ ఉద్యోగరీత్యా ఇటీవల అమృత్సర్ వెళ్లాడు. ఈక్రమంలో ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొప్ప రాకేష్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఇంటికి వచ్చిన భర్తకు విషయం తెలియడంతో పలుమార్లు పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయతీలో రజితను మందలించారు. అయినా ఆమెలో మార్పురాకపోగా రజిత తల్లి భాగ్య, ప్రియుడు రాకేశ్ కలిసి శ్రావణ్‌ను మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.