Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కోల్కతా: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్(100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. తల్లి అంత్యక్రియలు పూర్తైన కొద్దిసేపటికే ఆ బాధను దిగమింగుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. నిజానికి ప్రధాని నేడు పశ్చిమ బెంగాల్ లో పర్యటించాల్సింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. కానీ, రెండు రోజుల క్రితం తన తల్లి అనారోగ్యానికి గురైన ఆమె నేడు తది శ్వాస విడిచారు. దీంతో ఆయన తక్షణమే అహ్మాదాబాద్ కు హుటాహుటిన వెళ్లారు. దీంతో కోల్కతా పర్యటనను రద్దు చేసుకున్నారు. తల్లి అంత్యక్రియలు పూర్తైన తరువాత.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. హావ్డా, న్యూ జల్పయ్గురిని కలిపే వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. కాగా, వ్యక్తిగత కారణాల చేత బెంగాల్ రాలేకపోయి నందుకు ప్రధాని బెంగాల్ ప్రజలను క్షమాపణలు కోరారు.