Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం జరిగిన హావ్డా రైల్వే స్టేషన్లో హైడ్రామా నెలకొంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనానికి గురై వేదికపైకి వెళ్లేందుకు నిరాకరించారు. రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. కార్యక్రమం ఆసాంతం కూడా ఆమె ప్రేక్షకుల మధ్యలోనే కూర్చున్నారు. వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం నిమిత్తం రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రజల్లో కొంతమంది ఓ వర్గానికి మద్దతుగా గట్టిగా నినాదాలు చేశారు. దీంతో దీదీ అసహనానికి గురయ్యారు. హీరాబెన్ మృతి పట్ల మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానికి ధైర్యం చెప్పారు.