Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం విధితమే. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు పంత్ ను వెంటనే డెహ్రాడూన్లోని ఆస్నత్రికి తరలించారు. తాజాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. పంత్ నుదురు చిట్లిందని, వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలి లిగ్మెంట్ స్థానభ్రంశమైనట్టు ఎక్స్రేల్లో తెలిసినట్టు పేర్కొంది. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు, మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.
మరికొన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అతడి పరిస్థితిని సునిశతంగా పరిశీలిస్తున్నాం. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సంసిద్ధంగా ఉన్నాం’’ అని షా ట్వీట్ చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడినట్టు తెలిపారు.
వైద్య ఖర్చంతా భరిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం
పంత్ వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడని.. దీంతో వాహనంలో మంటలు చెలరేగినట్టు డీజీపీ తెలిపారు.