Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహేందర్రెడ్డి రేపు (శనివారం ) పదవి విరమణ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం హైదరాబాద్ లకిడికాపూల్లోని తన కార్యాలయంలో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి సేవలందించారని కొనియాడారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, రాష్ట్ర డీజీపీగా, దాదాపు 34 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా అందరి మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీ లు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ పాల్గొన్నారు.