Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లోని రోహటాంగ్ అటల్ టన్నెల్ వద్ద భారీ హిమపాతం కారణంగా వందలాది పర్యాటకులు చిక్కుకుపోయారు. మనాలి-లేహ్ రహదారిలో గురువారం నుంచి తీవ్రస్థాయిలో మంచు కురుస్తుండడంతో 400కి పైగా వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున మంచు రోడ్డుపై పేరుకుపోయింది.
మంచు కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీనిపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పర్యాటకులను కాపాడారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి పర్యాటకులను అక్కడి నుంచి తరలించగలిగారు. అంతకుముందు, హిమపాతం కారణంగా వాహనాల్లోనే ఉండిపోయిన పర్యాటకులకు పోలీసులు ఆహార పదార్థాలు అందించారు.