Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ద్వారా నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదలైంది. 1365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.