Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: కార్పొరేట్ విరాళాల్లో బీజేపీ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. కార్పొరేట్ సంస్థలు బీజేపీపై విరాళాల వర్షం కురింపించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఎడిఆర్) పరిశీలనలో వెల్లడైంది. 2021-22 సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్స్ ద్వారా బీజేపీకి 72 శాతం కంటే ఎక్కువ చందాలు వచ్చినట్లు ఎడిఆర్ నివేదిక తెలిపింది. ఎడిఆర్ ప్రతిఏడాది ఎలక్టోరల్ ట్రస్ట్స్ నుండి వచ్చే విరాళాలపై వార్షిక నివేదికను ప్రచురిస్తుంది. భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్), సమాజ్ వాది పార్టీ, ఆప్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లతో పోల్చితే కాంగ్రెస్‌కు తక్కువ ఫలితాలు వచ్చాయి. ఎలక్టోరల్ ట్రస్ట్ నుండి 2021-22లో కాంగ్రెస్ కంటే బీజేపీకి పంతొమ్మిదిరెట్లు ఎక్కువ విరాళాలు అందాయని ఎడిఆర్ విశ్లేషణలో తేలింది. బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు మిగతా తొమ్మిది పార్టీలకు వచ్చిన దానికంటే 2.5 రెట్లు ఎక్కువ.
ఎడిఆర్ ప్రకారం... ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుండి కాంగ్రెస్‌కు రూ.18.44 కోట్లు, టీఆర్ఎస్కు రూ. 40 కోట్లు, సమాజ్‌వాది పార్టీకి రూ. 27 కోట్లు, ఆప్ పార్టీకి రూ.21.12 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు రూ.20 కోట్లు వచ్చాయి. ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా ఎస్ఎడి రూ. 7 కోట్లు, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి రూ. కోటి, గోవా ఫార్వర్డ్ పార్టీ, డిఎంకెలు రూ. 50 లక్షలు అందుకున్నట్లు నివేదిక పేర్కొంది. కార్పొరేట్లు, వివిధ వ్యక్తులు నుండి ఎలక్టోరల్ ట్రస్ట్‌కు మొత్తం రూ. 487.09 కోట్లు వచ్చాయని, వివిధ రాజకీయ పార్టీలకు 487.06 కోట్లు (99.99శాతం) పంపిణీ చేశాయని ఎడిఆర్ పేర్కొంది.2020-21తో పోలిస్తే బిజెపికి విరాళాలు ఇచ్చే కార్పొరేట్ సంస్థల వాటా దాదాపు పది శాతం తగ్గినప్పటికీ.. నగదు మాత్రం దాదాపు రూ. 130 కోట్లకు పెరిగింది. ఎడిఆర్ గత ఏడాది విశ్లేషణ ప్రకారం.. ఎన్నికల ట్రస్టుల ఉండి అన్ని రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో బిజెపికి రూ. 212.05 కోట్లు (82.05 శాతం) అందాయి.