Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీ పొల్యూషన్ ప్లాన్ స్టేజ్-3ని అమల్లోకి తెచ్చింది. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధం విధించింది. ఢిల్లీలో గత 24 గంటల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శుక్రవారం 288 పాయింట్ల వద్ద నిలవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత శుక్రవారంనాడు రియల్-టైమ్ సోర్స్ అపోర్షన్మెంట్ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్య కారకాలను గుర్తించే పని వేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు 2021 అక్టోబర్లో మంత్రి వర్గం ఆమోదం తెలపగా, 2022 నవంబర్లో ఈ ప్రాజెక్టును కాన్పూర్ ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఢిల్లీ, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) చేపట్టింది.