Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో 2023 మార్చి 29 నాటికి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్నాయి. ఈ తరుణంలో సవరించిన ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. మార్చి 29న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం, కడప, అనంతపురం, కర్నూలు-గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ-గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు-టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం, కడప, అనంతపురం, కర్నూలు-టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఖాళీ కానున్నాయి.