Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి : యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆలయ ఈఓ ఎన్ గీత, భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ తరుణంలో సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా రూ.కోటి వెచ్చించి కొండపైన, రింగ్‌రోడ్డు చుట్టూ, ప్రెసిడెన్సియల్ సూట్, యాదాద్రి- రాయగిరి ప్రధాన రోడ్డుకు బిగించిన సీసీ కెమెరాలను కొండపైన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసినట్లు తెలిపారు.