Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ తరుణంలో తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం జరగనుంది. ఉదయం 8:25 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహేందర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు.