Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నవంబర్ 5 తోనే పూర్తయింది. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించింది. వచ్చే నెల 8న ప్రిలిమినరీ రాత పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహించనున్నట్లు ఉదయం 10 నుంచి 12 వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు రెండో పేపర్ పై పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 31 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.