Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మూడో తరగతి విద్యార్థిపై నలుగురు సీనియర్ విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా అతడి మర్మాంగాన్ని దారంతో కట్టారు. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లోని అటల్ ఆదర్శ్ విద్యాలయంలో బాధిత బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అతడికి ఎనిమిదేళ్లు. ఈ నెల 24న బాలుడు పాఠశాలకు వెళ్లాడు. అనంతరం టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో 16 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు సీనియర్ విద్యార్థులు బాధితుడిపై దాడి చేశారు. అనంతరం అతడి మర్మాంగాన్ని దారంతో కట్టారు. దారాన్ని అలాగే ఉంచుకోవాలని హెచ్చరించారు. విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాలుడు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పిని భరించలేక.. రెండు రోజులు పాఠశాలకు వెళ్లలేదు. బుధవారం సాయత్రం కుమారుడు స్నానం చేస్తుండగా.. మర్మాంగం దారంతో కట్టి ఉండటాన్ని బాలుడి తండ్రి గమనించడంతో విషయం బయటపడింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.