Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నయాసాల్ వేడుకలకు నగరం ముస్తాబైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్‌పై కేసులు నమోదు చేయనున్నట్టు ప్రకటించారు. డిసెంబరు 31 రాత్రి నుంచి జనవరి 1 వరకూ పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బేగంపేట్, లంగర్‌హౌస్ మినహా అన్ని పై వంతెనలపై రాకపోకలు నిలిపివేయనున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు తెలిపారు. మొదటిసారి చిక్కితే రూ.10,000 జరిమానా, 6 నెలల జైలుశిక్ష, రెండోసారైతే రూ.15,000, 2 సంవత్సరాల శిక్ష తప్పదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్‌కు రవాణా శాఖకు పంపుతామన్నారు. మొదటిసారి 3 నెలల సస్పెన్షన్, రెండోసారి పట్టుబడిన వారి లైసెన్స్ శాశ్వతంగా రద్దవుతుందన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని డీసీపీ సూచించారు.