Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అయితే బేగంపేట, లంగర్‌హౌస్ పైవంతెనలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పై వాహనాలకు అనుమతి నిలిపివేశారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలను నిషేధించారు. ఇక ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీద నుంచి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. మద్యం సేవించి బండి నడిపితే రూ.10 వేలు జరిమానా విధించనున్నారు.