Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ్సారి పట్టణ సమీపంలో శనివారం తెల్లవారుజామున బస్సు, కారును ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా,మరో 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన 32 మందిలో 17 మందిని వల్సాద్‌లోని ఆసుపత్రికి, 14 మందిని నవ్‌సారిలోని ఆస్పత్రికి, మరొక క్షతగాత్రుడిని చికిత్స కోసం సూరత్ ఆసుపత్రికి తరలించినట్లు అదనపు జిల్లా కలెక్టర్ కేతన్ జోషి తెలిపారు. తొమ్మిది మృతదేహాలను పోలీసు బృందాలు స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించినట్లు జోషి చెప్పారు.ఫార్చ్యూనర్ కారులో 9 మంది ప్రయాణికులు ఉన్నారని, వారు అంక్లేశ్వర్‌లోని ఒక సంస్థలో ఉద్యోగులని పోలీసులు చెప్పారు. బస్సులో ప్రయాణికులు అహ్మదాబాద్ నుంచి వల్సాద్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గుజరాత్ పోలీసులు చెప్పారు.