Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహారాష్ట్ర సతారాలోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనక కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. బురదలో సగం పాతిపెట్టి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహాన్నిసతారాలోని వాడే గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాంతాతై నలవాడేకు చెందిన మూసివున్న బంగళా సమీపంలో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఏడాది మహారాష్ట్రలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇళ్ల నుంచి పోలీసులు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. జూన్లో జరిగిన ఇలాంటి ఘటన ఒకటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంగ్లి జిల్లాలోని మహిసాల్ గ్రామంలో ఇద్దరు సోదరులకు చెందిన 9 మంది కుటుంబ సభ్యులు చనిపోయి కనిపించారు. సోదరులకు చెందిన రెండు వేర్వేరు ఇళ్లలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.