Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరంలోని ఎల్బీనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ, 12 ఎల్ఎస్డీ పేపర్ స్ట్రీప్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్సును గోవా నుంచి తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 26న కూడా హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50 కోట్ల విలువైన 25 కిలోల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు.