Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమెరికా ప్రఖ్యాత టీవీ న్యూస్ యాంకర్ బార్బరా వాల్టర్స్ కన్నుమూశారు. ఆమె వయసు 93 ఏళ్లు. దాదాపు అర శతాబ్ధం పాటు ఆమె న్యూస్ యాంకర్‌గా చేశారు. 1976లో తొలిసారి ఆమె ఏబీసీ న్యూస్ ఛానల్లో ప్రోగ్రామ్ చేశారు. తొలి మహిళా టీవీ యాంకర్‌గా ఆమె అమెరికాలో రికార్డు క్రియేట్ చేశారు. బోస్టన్‌లో పుట్టిన ఆ యాంకర్.. తన కెరీర్లో 12 ఎమ్మీ అవార్డులను గెలచుకున్నారు. రిచర్డ్ నిక్సన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు.. తన కెరీర్లో ప్రతి ఒక అమెరికా ప్రెసిడెంట్‌ను ఆమె ఇంటర్వ్యూ చేశారు. మ్యూజిక్, పాప్ స్టార్లను కూడా బార్బరా ఇంటర్వ్యూ చేశారు. అమెరికాలో తొలి మహిళా జర్నలిస్టుగా ఆమె ఖ్యాతి గాంచారు.