Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం బొప్పారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నార తిరుపతి అనే వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు, గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. అసైన్డ్ భూమిలో నిర్మాణం చేస్తున్నందున అడ్డుకున్నట్లు రెవెన్యూ అధికారుల వెల్లడించారు. వందల ఇళ్లను వదిలేసి తననే వేధిస్తున్నారని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.